Flamingos: ఎమిరేట్స్ విమానం ఢీకొని ముంబైలో 36 ఫ్లెమింగోల మృతి.. దెబ్బతిన్న ఫ్లైట్

Emirates flight hit kills 36 flamingos in Mumbai

  • సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ఘటన
  • ముంబై పరిసర ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పక్షుల కళేబరాలు
  • ప్రతి వేసవిలో నవీముంబై, థానే క్రీక్‌కు ఫ్లెమింగోల వలస

ఎమిరేట్స్ విమానం ఢీకొనడంతో 36 ఫ్లెమింగోలు మృతి చెందాయి. ఇవన్నీ ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో వివిధ చోట్ల చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ఘటనలో విమానం ముందుభాగం బాగా దెబ్బతింది. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగిందీ ఘటన. విమానం దెబ్బతిన్నప్పటికీ సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రతి వేసవిలోనూ నవీ ముంబై పరిసరాల్లో చిత్తడి ప్రాంతాలతోపాటు థానే క్రీక్‌కు ఫ్లెమింగోలు పెద్ద ఎత్తున వలస వస్తాయి.

విమానం ముంబై ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతున్న సమయంలో ఫ్లెమింగో గుంపును ఢీకొట్టింది. దీంతో అవి పరిసర ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడిపోయాయి. చచ్చిపడిన ఫ్లెమింగోలను చూసిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పలు ప్రాంతాల నుంచి వరుసగా ఫోన్‌కాల్స్ రావడంతో వెంటనే స్పందించిన అటవీ అధికారులు పక్షుల కళేబరాలను తీసుకెళ్లారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో పక్షల కళేబరాల కోసం గాలించారు. అనంతరం వాటి మరణానికి గల కారణాన్ని తెలుసుకునేందుకు పోస్టుమార్టానికి పంపించారు.

  • Loading...

More Telugu News