Manish Sisodia: మ‌నీశ్‌ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ మే 31 వరకు పొడిగింపు

Delhi HC extends Manish Sisodia custody till May 31 in Delhi liquor scam case

  • ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఢిల్లీ హైకోర్టు తీర్పు
  • ఈ నెల 14న సిబీఐ, ఈడీ, ఆప్‌నేత‌ త‌ర‌ఫున వాద‌న‌లు విన్న హైకోర్టు
  • ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మ‌నీశ్‌ సిసోడియా

మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ హైకోర్టు ఈ నెల 31 వరకు పొడిగించింది. మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ, సీబీఐ దాఖలు చేసిన మనీలాండరింగ్, అవినీతి కేసుల్లో ఆప్ నేత‌ జ్యుడీషియల్ కస్టడీని మే 31 వరకు పొడిగిస్తూ ఢిల్లీ హైకోర్టు మంగ‌ళ‌వారం తీర్పును వెల్ల‌డించింది.

మ‌నీశ్ సిసోడియా, సీబీఐ, ఈడీ తరఫున వాదనలు విన్న హైకోర్టు మే 14న పిటిషన్లపై తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసిన విష‌యం తెలిసిందే. రెండు బెయిల్‌ పిటిషన్లపైనా న్యాయమూర్తి స్వర్ణ కాంత శర్మ ఈ మేర‌కు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈడీ, సీబీఐ మనీశ్ సిసోడియాను బెయిల్ పై విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. కాగా, సిసోడియా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో 2023 ఫిబ్రవరి నుంచి జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News