Karnataka: ప్రజ్వల్ రేవణ్ణకు మాజీ సీఎం కుమారస్వామి విజ్ఞప్తి

Kumaraswamy again appeals to Prajwal to return to India
  • వీలైనంత త్వరగా భారత్‌కు వచ్చి పోలీసులకు లొంగిపోవాలని సూచన
  • విదేశాల నుంచి వచ్చి విచారణను ఎదుర్కోవాలని విజ్ఞప్తి
  • ప్రజ్వల్‌పై ఆరోపణల విషయంలో తమ పార్టీకి, బీజేపీకి మధ్య విభేదాలు లేవని వెల్లడి
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఓ విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా భారత్‌కు వచ్చి పోలీసులకు లొంగిపోవాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చి విచారణను ఎదుర్కోవాలన్నారు. ప్రజ్వల్‌పై ఆరోపణల విషయంలో తమ పార్టీకి, బీజేపీకి మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఈ కేసుకు, పొత్తుకు ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు.

ప్రజ్వల్ ఏప్రిల్ 27న దౌత్యపరమైన పాస్‌పోర్టుతో జర్మనీకి వెళ్లినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హసన్ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగిన మరుసటిరోజునే ఆయన విదేశాలకు వెళ్లాడు. ఇంకా పరారీలోనే ఉన్నాడు. రేవణ్ణపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో విచారణకు కర్ణాటక ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది.
Karnataka
Prajwal Revanna
JDS

More Telugu News