Virat Kohli: 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ నయా రికార్డు

Virat Kohli scripted history as he became the first player to score 8000 runs in IPL

  • ఐపీఎల్ హిస్టరీలో 8,000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడిగా విరాట్
  • రాజస్థాన్‌పై మ్యాచ్‌లో రికార్డు సొంతం చేసుకున్న కోహ్లీ
  • కోహ్లీ తర్వాతి స్థానంలో నిలిచిన శిఖర్ ధావన్

ఐపీఎల్ చరిత్రలో కింగ్ విరాట్ కోహ్లీ మరో రికార్డును సృష్టించాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 8,000 పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా కోహ్లీ నయా రికార్డు నెలకొల్పాడు. బుధవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోహ్లీ ఈ ప్రత్యేక మైలురాయిని సొంతం చేసుకున్నాడు.

గత రాత్రి రాజస్థాన్ రాయల్స్‌పై మ్యాచ్‌లో 24 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 33 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అయితే వ్యక్తిగత స్కోరు 29 పరుగుల వద్ద విరాట్ 8,000 పరుగుల మైలురాయి అందుకున్నాడు. కోహ్లీ తర్వాతి స్థానంలో శిఖర్ ధావన్ 6,769 పరుగులతో ఉన్నాడు. 

కాగా ఐపీఎల్-2024లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌ని ప్రదర్శించాడు. 15 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ ఏకంగా 741 పరుగులు చేశాడు. 64 సగటు, 155 స్ట్రైక్ రేట్‌తో ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ ఏడాది సీజన్‌లో కోహ్లీ ఒక సెంచరీ, 5 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. కాగా రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిపోవడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇంటిదారి పట్టింది. ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలనే ఆర్సీబీ కల వరుసగా 17వ సారి చెదిరింది. ముఖ్యంగా సుదీర్ఘకాలం నుంచి విరాట్ కోహ్లీకి మరోసారి నిరాశ తప్పలేదు.

  • Loading...

More Telugu News