Kedarnath: కేదార్నాథ్ ఆలయం వద్ద గాల్లో గింగిర్లు కొడుతూ హెలికాప్టర్ ల్యాండింగ్... పరుగు తీసిన భక్తులు... వీడియో ఇదిగో
- శుక్రవారం ఉదయం పైలట్ సహా ఏడుగురితో సిర్సి హెలిప్యాడ్ నుంచి కేదార్నాథ్ బయలుదేరిన హెలికాప్టర్
- సాంకేతిక కారణాలతో అత్యవసరంగా ల్యాండింగ్
- ఆలయానికి సమీపంలోని హెలిప్యాడ్‌కు కొన్ని మీటర్ల దూరంలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్
- పైలట్ సహా విమానంలోని ఏడుగురు సురక్షితంగా ఉన్నట్లు తెలిపిన అధికారులు
కేదార్నాథ్ ఆలయం సమీపంలో పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో ఓ హెలికాప్టర్ గాల్లో గింగిర్లు కొట్టింది. దీంతో కింద ఉన్న భక్తులు భయంతో పరుగులు పెట్టారు. పైలట్ చాకచక్యంగా సేఫ్‌గా ల్యాండింగ్ చేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
మామూలుగా ట్రెకింగ్ చేయలేని భక్తులు హెలికాప్టర్లో ఆలయం వద్దకు వెళతారు. అలాగే, శుక్రవారం ఉదయం పైలట్ సహా ఏడుగురితో సిర్సి హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ కేదార్నాథ్ కు బయలుదేరింది. అయితే, హెలికాప్టర్ సాంకేతిక కారణాలతో అత్యవసరంగా ల్యాండ్ అయింది. కేదార్నాథ్ ఆలయానికి సమీపంలోని హెలిప్యాడ్‌కు కొన్ని మీటర్ల దూరంలోనే ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. పైలట్ సహా విమానంలోని ఏడుగురు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.