IMD: ఏపీపై తుపాను ప్రభావం లేకపోయినా ద్రోణి కారణంగా వర్షాలు
- బంగాళాఖాతంలో వాయుగుండం
- ఈ రాత్రికి తుపానుగా మారే అవకాశం
- రాజస్థాన్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకు ద్రోణి
- ఏపీలో రేపు, ఎల్లుండి విస్తారంగా వర్షాలు
- మంగళవారం నుంచి పొడి వాతావరణం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ రాత్రికి తుపానుగా మారుతుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ఇది పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య రేపు తీరం దాటనుందని తెలిపింది. ఈ తుపాను ప్రభావం ఏపీపై లేదని వివరించింది.
అయితే, ఏపీలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఉపరితల ద్రోణి కారణమని ఐఎండీ పేర్కొంది. రాజస్థాన్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకు ఈ ద్రోణి విస్తరించి ఉన్నట్టు వెల్లడించింది.
ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రేపు, ఎల్లుండి కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. మంగళవారం (మే 28) నుంచి ఏపీలో పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది.