Vamsi: ఆ ఫైలు ఫారెస్టు గెస్టుహౌసులో మరిచిపోయాను: డైరెక్టర్ వంశీ

Vamsi Interview

  • 1985లో విడుదలైన 'అన్వేషణ'
  • కథ లేకుండానే టైటిల్ పెట్టేశామన్న వంశీ 
  • వారం రోజుల్లో కథ రాశానని వెల్లడి 
  • ఇళయరాజాగారి దగ్గర అలా జరిగిందని వ్యాఖ్య


వంశీ దర్శకత్వం వహించిన సినిమాలలో 'అన్వేషణ' స్థానం ప్రత్యేకం. 1985లో విడుదలైన ఈ సినిమా, భారీ విజయాన్ని సాధించింది. కార్తీక్ - భానుప్రియ జంటగా నటించిన ఈ సినిమా, వాళ్ల కెరియర్లో గుర్తుండిపోయే చిత్రంగా నిలిచిపోయింది. కథాకథనాలు .. ఇళయరాజా పాటలు ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయి. అలాంటి ఈ సినిమా విశేషాలను తాజాగా తన వీడియో ద్వారా వంశీ పంచుకున్నారు.

" చిన్నప్పటి నుంచి కూడా నాకు సస్పెన్స్ అంటే ఇష్టం. అందువలన ఈ సారి సస్పెన్స్ కథ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. నిర్మాత కామినేని ప్రసాద్ గారు రెడీగానే ఉన్నారు. 'అన్వేషణ' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించమని చెప్పాను. అసలు కథనేది ఏమీ అనుకోకుండా టైటిల్ చెప్పడంతో వాళ్లు ఆశ్చర్యపోయారు .. ఆలోచనలో పడ్డారు. అడవి నేపథ్యంలో సస్పెన్స్ కథను రెడీ చేయాలని నేను అనుకున్నాను" అని అన్నారు. 

"అరకులో ఈ సినిమాలు చేయాలనే ఉద్దేశంతో ముందుగా అక్కడ లొకేషన్స్ చూసుకోవడానికి వెళ్లాము. అక్కడి ఉడెన్ గెస్టు హౌస్ లో దిగాము. నేను ప్రతిరోజు అలా ఫారెస్టులోకి నడచుకుంటూ వెళ్లి వస్తూ, వారం పది రోజులలో కథను సిద్ధం చేశాను. ఈ లోగా ఇళయరాజా గారితో మ్యూజిక్ సిటింగ్స్ డేట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. హడావిడిగా అందరం అక్కడికి వెళ్లాము. కానీ నేను రాసుకున్న కథ .. పాటల సందర్భాలకు సంబంధించిన ఫైల్ అరకు గెస్టుహౌస్ లో ఉండిపోయిందనే విషయం అర్ధమయ్యేసరికి నా గుండె ఝల్లుమంది" అని చెప్పారు. 

  • Loading...

More Telugu News