Kuppam: చిత్తూరు ఎంపీ స్థానం పోల్ డేటా విడుదల చేసిన సీఈవో... కుప్పంలో అత్యధిక పోలింగ్

AP CEO releases Chittoor Lok Sabha constituency poll data

  • ఏపీలో మే 13న జరిగిన పోలింగ్
  • పార్లమెంటు స్థానాల వారీగా పోల్ డేటా విడుదల చేస్తున్న సీఈవో 
  • చిత్తూరు ఎంపీ స్థానం పరిధిలో 85.77 శాతం పోలింగ్
  • కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో 89.88 శాతం పోలింగ్

ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నేడు చిత్తూరు లోక్ సభ స్థానం పరిధిలో నమోదైన పోల్ డేటాను విడుదల చేసింది. 

చిత్తూరు పార్లమెంటు స్థానం పరిధిలో మొత్తం 16,40,202 మంది ఓటర్లు ఉన్నారని, వారిలో 14,06,880 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని వెల్లడించింది. తద్వారా 85.77 శాతం పోలింగ్ నమోదైందని పేర్కొంది. 

అందులో పురుష ఓటర్ల శాతం 86.14, మహిళా ఓటర్ల శాతం 85.41, ట్రాన్స్ జెండర్ ఓటర్ల శాతం 46.96 అని సీఈవో కార్యాలయం వివరించింది. 

ఇక, చిత్తూరు ఎంపీ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల వారీగా పోలింగ్ శాతాన్ని కూడా సీఈవో కార్యాలయం విడుదల చేసింది. 

అత్యధికంగా కుప్పం నియోజకవర్గంలో 89.88 శాతం, గంగాధర నెల్లూరులో 88.69, పలమనేరులో 87.90, పూతలపట్టులో 87.66, నగరిలో 87.08, చిత్తూరులో 81.24, చంద్రగిరిలో 79.90 శాతం పోలింగ్ నమోదైనట్టు వివరించింది.

  • Loading...

More Telugu News