WhatsApp: వాట్సప్‌లో త్వరలోనే ఏఐ ఆధారిత ‘ఇమాజిన్’ ఫీచర్

WhatsApp to introduces AI Imagine feature for photo generation for Users

  • ‘ఏఐ ఇమాజిన్’ ఫీచర్‌తో యూజర్లు ఫొటోలు క్రియేట్ చేసుకునే ఛాన్స్
  • త్వరలోనే పరిచయం చేయనున్న మెటా
  • టెక్స్ట్ నుంచి సైతం ఫొటోలు క్రియేట్ చేసుకునే అవకాశం

ఏఐ సాంకేతిక వ్యవస్థ వినియోగంలో ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సప్’ మరో ముందడుగు వేసింది. త్వరలోనే మరో సరికొత్త ఏఐ ఫీచర్‌ను యూజర్లకు అందించేందుకు సమాయత్తమవుతోంది. యూజర్లు తమకు నచ్చిన ఫొటోలను క్రియేట్ చేసుకునేలా ఏఐ ఆధారిత ‘ఇమాజిన్’ అనే ఫీచర్‌ను త్వరలోనే పరిచయం చేయబోతోంది. ఈ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉందని ‘వాట్సప్‌‌బీటా ఇన్ఫో’ (WABetaInfo) కథనం పేర్కొంది. ఆండ్రాయిడ్ వెర్షన్ 2.24.12.4లో ఈ ఫీచర్ కనిపించిందని, ఈ ఫీచర్ త్వరలోనే పెద్ద సంఖ్యలో యూజర్లకు అందుబాటులోకి రానుందని, టెక్స్ట్ నుంచి సైతం ఫొటోలను రూపొందించుకోవచ్చునని ‘వాట్సప్‌బీటా ఇన్ఫో’ రిపోర్ట్ పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఒక స్క్రీన్‌షాట్ కూడా వైరల్‌‌గా మారింది.

ఫొటో ఎలా క్రియేట్ చేయాలి?
ఏఐ ఇమాజిన్ ఫీచర్‌‌ అటాచ్‌మెంట్ ఆప్షన్లలో కనిపిస్తుంది. అటాచ్‌మెంట్ ఆప్షన్లలో ఇమాజిన్‌పై టాప్ చేసి కావాల్సిన విధంగా ఏఐ ఫొటోలను సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇక గ్రూప్ చాట్‌లో @Meta AI అని ట్యాగ్ చేసి ఈ ఫీచర్‌ యాక్సెస్‌ను పొందవచ్చు. ఈ ఫీచర్ తొలుత అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి రానుంది. అయితే భారత్‌లోని యూజర్లకు ఈ ఫీచర్ ఎప్పటి నుంచి అందుబాటులోకి రానుందనేది తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News