Final Phase: ముగిసిన సార్వత్రిక ఎన్నికల ఏడో దశ పోలింగ్
- దేశంలో ఈసారి ఏడు దశల్లో పోలింగ్
- నేడు చివరి విడత పోలింగ్
- సాయంత్రం 6 గంటలకు ముగిసిన ఓటింగ్
- సాయంత్రం 5 గంటల వరకు 58.34 శాతం పోలింగ్
దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ క్రతువు ముగిసింది. ఈసారి దేశంలో 7 విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరగ్గా, నేడు చివరిదైన ఏడో దశ పోలింగ్ నిర్వహించారు.
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. సాయంత్రం 6 గంటల సమయానికి క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల వరకు 58.34 శాతం పోలింగ్ నమోదైంది.
చివరి దశలో ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని 57 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. అదే సమయంలో ఒడిశా అసెంబ్లీలో 42 స్థానాలకు కూడా పోలింగ్ జరిపారు. కాగా, అన్ని దశలకు కలిపి జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.