AC Explosion: నోయిడాలో పేలుతున్న ఏసీలు.. మీ ఏసీ సురక్షితమేనా?

Fire Breaks Out At Noida IT Company Due To AC Explosion
  • నోయిడాలో తరచూ పేలుతున్న ఏసీలు
  • ఫైర్ సిబ్బంది అప్రమత్తంగా ఉండడంతో తప్పిన ప్రాణనష్టం
  • మెయింటెనెన్స్ లేమి వల్లే ఏసీలు పేలుతాయంటున్న నిపుణులు
ఇంట్లో నిత్యం వాడే వస్తువుల నిర్వహణ ఎంత ముఖ్యమో చెప్పే ఘటన ఇది. నిర్వహణ లోపంతో నోయిడాలోని ఓ హైరైజ్ అపార్ట్‌మెంట్‌లోని పదో అంతస్తులో ఏసీ భారీ శబ్దంతో పేలి మంటలు అంటుకున్నాయి. దట్టమైన పొగలు రావడంతో అపార్ట్‌మెంట్ వాసులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఫైర్ సర్వీస్ విభాగం వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. అక్కడే ఓ ఐటీ కంపెనీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఈ రెండు ఘటనల్లోనూ ఎవరికీ ఎలాంటి హానీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వేసవి ఉష్ణోగ్రతల వల్లే ఇలా జరిగిందని చాలామంది భావిస్తున్నారు. నిజం చెప్పాలంటే కారణం అది కాదు. నిర్వహణ లేకపోవడమే ఇలాంటి వాటికి కారణం అవుతుంటాయి.

వెంటిలేషన్ సరిగా లేకపోవడం, ఫిల్టర్లు మూసుకుపోవడం, ఏజింగ్ యూనిట్ల వల్ల ఓవర్ హీటింగ్ అనేది ఓ సాధారణ సమస్యలా మారిపోతోంది. కాబట్టే నిత్యం వీటిని మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి. లేదంటే జరిగేది ఇలాంటి ప్రమాదాలే. మరి ఎలాంటి భయం లేకుండా ఏసీ నుంచి వచ్చే హాయిని ఆస్వాదించాలంటే ఏం చేయాలి? వాస్తవానికి ఇండియా వంటి అధిక ఉష్ణోగ్రత కలిగిన దేశాల్లో ఏసీ నిర్వహణ అనేది అత్యంత ముఖ్యమైన విషయం. ఏసీలో మంటలు నివారించేందుకు ఇంటి యజమానులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 

అందులో మొదటిది ఫిల్టర్లు: వీటిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. దుమ్ము, ధూళి వల్ల ఇవి మూసుకుపోయి ఎయిర్ ఫ్లోను అడ్డుకుంటుంది. ఫలితంగా సాధారణం కంటే కూడా ఏసీ ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. అది ఏసీ యూనిట్‌పై ఒత్తిడి పెంచుతుంది. కాబట్టి నిత్యం వీటిని తనిఖీ చేస్తూ ఉండాలి. 

రెండోది రిఫ్రిజిరెంట్ లీక్స్: వీటి లెవల్స్ తక్కువగా ఉంటే గదిని చల్లబరిచేందుకు ఏసీ మరింత కష్టపడాల్సి వస్తుంది. ఫలితంగా వేడెక్కిపోతోంది. కాబట్టి రిఫ్రిజిరెంట్ లెవల్స్ సరిగా ఉన్నాయో, లేదో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి.

మూడోది వైరింగ్: ఏసీ పనితీరులో ఇది చాలా ముఖ్యమైన విషయం. పేలవమైన ఎలక్ట్రిక్ కనెక్షన్, లేదంటే వైరింగ్ షార్ట్ సర్క్యూట్‌కు దారితీస్తుంది. లేదంటే ఓవర్ హీటింగ్‌కు కారణమవుతుంది. కాబట్టి వైరింగ్‌ను రెగ్యులర్‌గా చెక్ చేసుకోవడం అనేది అన్నింటికంటే ముఖ్యమైన విషయం.
 
నాలుగోది వెంట్‌లు: ఇవి కనుక మూసుకుపోతే గాలి ప్రవాహంలో అడ్డంకులు ఏర్పడి ఏసీ వేడెక్కుతుంది. కాబట్టి వెంట్‌లు క్లియర్‌గా ఉన్నాయో, లేదో నిత్యం చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే, మెకానిక్ సమస్యలను పరిష్కరించుకోవడం ద్వారా వైబ్రేషన్స్, శబ్దాన్ని నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
AC Explosion
AC Blast
IT Company
Noida
High Rise Apartments
AC Maintenance

More Telugu News