Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు ఏపీలో మరింత విస్తరించాయి: ఐఎండీ
- ఈసారి ముందుగానే వచ్చిన నైరుతి రుతుపవనాలు
- రుతుపవనాల విస్తరణకు అనుకూల వాతావరణం ఉందన్న ఐఎండీ
- మరో నాలుగైదు రోజుల్లో చాలా ప్రాంతాలకు విస్తరిస్తాయని వెల్లడి
దేశంలో నైరుతి రుతుపవనాల కదలికలు ఆశాజనకంగా ఉన్నాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు నేడు మధ్య అరేబియా సముద్రంలోనూ, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లోనూ, రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని ఐఎండీ వివరించింది.
రుతుపవనాలు ముందుకు కదిలేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. దక్షిణ భారతదేశంలోని మిగిలిన భాగాలకు, దక్షిణ చత్తీస్ గఢ్, దక్షిణ ఒడిశా, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతంలోని చాలా భాగాలకు మరో నాలుగైదు రోజుల్లో రుతుపవనాలు చేరుకుంటాయని వెల్లడించింది.