Andhra Pradesh: ఏపీలో లోక్ సభ స్థానాల్లోనూ టీడీపీ హవా... కూటమి 20, వైసీపీ 5 స్థానాల్లో ఆధిక్యం

TDP alliance in leading at AP Lok Sabha constituencies

  • ఏపీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
  • అంతకంతకు పెరుగుతున్న టీడీపీ కూటమి ఆధిక్యం
  • టీడీపీ సొంతంగా 15 స్థానాల్లో లీడ్

ఏపీలో ఓట్ల లెక్కింపు కొనసాగేకొద్దీ టీడీపీ కూటమి అధిక్యం అంతకంతకు పెరిగిపోతుంది. అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపులో ఇప్పటికే 100కి పైగా స్థానాలతో ఆధిక్యంలో ఉన్న టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి... లోక్ సభ స్థానాల్లోనూ  దూసుకుపోతోంది. 

ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా... కూటమి 20 స్థానాల్లో ముందంజలో ఉంది. టీడీపీ 15, బీజేపీ 3, జనసేన 2, వైసీపీ 5 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. హిందూపురం పార్లమెంటు స్థానంలో తొలుత వెనుకబడిన టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథి... మళ్లీ  పుంజుకున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆధిక్యం 3,261 ఓట్లకు పెరిగింది. 

ఇప్పటివరకు ఆధిక్యంలో ఉన్నది వీరే... 

అమలాపురంలో జీఎంసీ బాలయోగి తనయుడు, టీడీపీ అభ్యర్థి హరీశ్
అనకాపల్లిలో బీజేపీ అభ్యర్థి సీఎం రమేశ్
అనంతపురంలో టీడీపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ
అరకులో వైసీపీ అభ్యర్థి గుమ్మా తనూజా రాణి
బాపట్లలో టీడీపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్
చిత్తూరులో టీడీపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాద్ రాజు
ఏలూరులో టీడీపీ అభ్యర్థి పుట్టా మహేశ్ కుమార్
గుంటూరులో టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్
కడపలో వైసీపీ అభ్యర్థి అవినాశ్ రెడ్డి
కాకినాడలో జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్
కర్నూలులో టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు
మచిలీపట్నంలో జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి
నంద్యాలలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి
నరసాపురంలో బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ
 నరసరావుపేటలో టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు
నెల్లూరులో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి  ప్రభాకర్ రెడ్డి
ఒంగోలులో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (287 ఓట్ల ఆధిక్యం)
రాజమండ్రిలో బీజేపీ అభ్యర్థి పురందేశ్వరి
రాజంపేటలో వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి (636 ఓట్ల ఆధిక్యం)
శ్రీకాకుళంలో టీడీపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు
తిరుపతిలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి
విజయవాడలో టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్
విశాఖలో టీడీపీ అభ్యర్థి శ్రీభరత్
విజయనగరంలో టీడీపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు

  • Loading...

More Telugu News