Odisha: ఒడిశాలో విజయం దిశగా బీజేపీ.. మెజారిటీ మార్క్ కు దగ్గరగా ఆధిక్యం

BJP Tsunami In Odisha

  • మొత్తం 73 స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల లీడ్
  • 50 స్థానాల్లో అధికార బీజేడీ అభ్యర్థుల ముందంజ
  • సీఎంగా పట్నాయక్ జైత్రయాత్రకు బ్రేక్

ఒడిశాలో నవీన్ పట్నాయక్ పార్టీ బిజూ జనతా దళ్ (బీజేడీ) జైత్రయాత్రకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బ్రేకులు వేయనున్నట్లు ఫలితాల ట్రెండ్ సూచిస్తోంది. 2000 సంవత్సరం నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నవీన్ పట్నాయక్ ఈసారి పదవికి దూరం కానున్నారు. ఫలితాల్లో 73 చోట్ల బీజేపీ అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతుండగా.. బీజేడీ అభ్యర్థులు కేవలం 50 చోట్ల ముందంజలో ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్ వివరాల ప్రకారం.. మరో 12 చోట్ల కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంది.

ఒడిశాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 74.. ఈ నేపథ్యంలో బీజేపీ 73 చోట్ల లీడ్ లో కొనసాగుతుండడంతో ఒడిశాలో ఈసారి అధికార మార్పిడి తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ భారీగా నమోదైంది. మొత్తంగా 74.4 శాతం ఓటింగ్ నమోదు కాగా.. 2019 ఎన్నికల్లో నమోదైన పోలింగ్ 73.20 శాతమే. గత ఎన్నికల్లో బీజేడీ 113 సీట్లు గెలుచుకోగా బీజేపీ 23 స్థానాలు, కాంగ్రెస్ కేవలం 9 స్థానాలకే పరిమితమయ్యాయి.

  • Loading...

More Telugu News