Smriti Irani: అమేథీలో స్మృతి ఇరానీకి ఎదురుదెబ్బ.. కాంగ్రెస్ అభ్యర్థి కంటే బాగా వెనకబడిన బీజేపీ నేత

 Smriti Irani trails Congress Candidate Kishori Lal Sharma in Amethi
  • యూపీలో ఈసారి సత్తా చాటుతున్న కాంగ్రెస్ కూటమి
  • అమేథీలో కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీలాల్‌కు 13 వేల ఓట్ల ఆధిక్యం
  • స్మృతి ఓటమి పక్కా అని చెబుతున్న ట్రెండ్స్
ఆశలు పెట్టుకున్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇక్కడి 80 స్థానాల్లో 41 చోట్ల ఇండియా కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక, అమేథీ నుంచి బరిలో ఉన్న స్మృతి ఇరానీ.. కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్ కంటే దాదాపు 13 వేల ఓట్ల వెనకబడి ఉన్నారు. 

అమేథీ నుంచి గెలుపు ఖాయమని మొదటి నుంచీ ధీమాగా ఉన్న స్మృతికి ఇప్పటి వరకు వచ్చిన ఓట్లు 29,122 కాగా, ప్రత్యర్థి కిశోరీలాల్‌కు 43,076 ఓట్లు వచ్చాయి. దేశంలోని ఇతర లోక్‌సభ స్థానాలతో పోల్చితే అమేథీ ప్రత్యేకతమైనది. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ కాంగ్రెస్‌కు తిరుగులేకుండా పోయింది. గత ఎన్నికల్లో మాత్రం రాహుల్ గాంధీని స్మృతి ఇరానీ ఓడించి సంచలనం సృష్టించారు. ఈసారి ట్రెండ్స్‌ను బట్టి చూస్తే స్మృతి ఓటమి పక్కా అని తెలుస్తోంది.
Smriti Irani
Amethi
Uttar Pradesh
Congress
Kishori Lal
BJP
INDIA Bloc

More Telugu News