YS Jagan: కాసేపట్లో రాజ్ భవన్ కు సీఎం జగన్... రాజీనామా సమర్పణ!
- ఏపీలో విజయం దిశగా టీడీపీ కూటమి
- వైసీపీకి ఊహించని రీతిలో ఎదురుదెబ్బ
- రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా మారుతున్న పరిణామాలు
ఏపీలో ఎన్నికల ఫలితాల ట్రెండ్ టీడీపీ కూటమి వైపే మొగ్గుచూపుతోంది. ఈసారి ఎన్నికల ఫలితాలు హోరాహోరీగా ఉండొచ్చని చాలా అంచనాలు వచ్చినప్పటికీ, వార్ వన్ సైడ్ అన్నట్టుగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎదురులేని రీతిలో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో, వైసీపీ ఓటమి ఖాయం కావడంతో, కాసేపట్లో సీఎం జగన్ రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు అందజేయనున్నారు.
కూటమి విజయం లాంఛనం కాగా, ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. అందుకు వీలు కల్పిస్తూ సీఎం జగన్ పదవి నుంచి వైదొలగనున్నారు.
ఇప్పటి వరకు ఓట్ల లెక్కింపు జరిగిన ప్రకారం... టీడీపీ ఒక స్థానంలో గెలిచి మరో 132 స్థానాల్లో ముందంజలో ఉండగా, జనసేన 20, వైసీపీ 16, బీజేపీ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.