Pinnelli Ramakrishna Reddy: మాచర్లలో పిన్నెల్లి కోటను బద్దలు కొట్టిన జూలకంటి... భారీ మెజారిటీతో విజయం

Julakanti Brahmareddy defeated Pinnelli Ramakrishna Reddy in Macherla
  • 21 రౌండ్లు పూర్తయ్యేసరికి జూలకంటి ఆధిక్యం 31,761
  • మరొక్క రౌండ్ మిగిలున్న ఓట్ల లెక్కింపు
  • గత 20 ఏళ్లుగా మాచర్లలో ఓటమెరుగని పిన్నెల్లి
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరుస విజయాల పరంపరకు అడ్డుకట్ట పడింది. ఈ ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. పిన్నెల్లి మాచర్ల నియోజకవర్గంలో గత  20 ఏళ్లుగా వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో పిన్నెల్లిపై టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఘనవిజయం సాధిస్తున్నారు. 

మాచర్ల అసెంబ్లీ స్థానంలో 21 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి జూలకంటి బ్రహ్మారెడ్డి 31,761 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. 21 రౌండ్ల అనంతరం జూలకంటికి 1,18,290 ఓట్లు రాగా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 86,529 ఓట్లు వచ్చాయి. ఇక్కడ మరొక్క రౌండ్ ఓట్ల లెక్కింపు మాత్రమే మిగిలున్న నేపథ్యంలో, జూలకంటి విజయం ఖరారైంది.
Pinnelli Ramakrishna Reddy
Julakanti Brahmareddy
Macherla
TDP
YSRCP

More Telugu News