Sai Dharam Tej: ఏపీ ఎన్నికల ఫలితాలపై సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర స్పందన

The present and future of Andhra Pradesh is now in safe hands says Hero Sai Dharam Tej
  • ఏపీ ఇప్పుడు సురక్షితమైన చేతుల్లో ఉందంటూ వ్యాఖ్య
  • పవన్ ‘బలమైన తుపాను’ సృష్టించారని కితాబు
  • ఎక్స్ వేదికగా స్పందించిన సాయి ధరమ్ తేజ్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం ఖాయమైంది. టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు రికార్డు స్థాయి స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. 160కిపైగా సీట్లు దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీల శ్రేణులు, మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. ఏర్పాటు కాబోయే ప్రభుత్వానికి, నేతలకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ జాబితాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మేనల్లుడు, సినీ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా చేరిపోయాడు.

పవన్‌ కల్యాణ్‌కు అభినందనలు తెలియజేస్తూ సాయి ‘ధరమ్ తేజ్’ ఎక్స్ వేదికగా స్పందించాడు. ఆంధ్రప్రదేశ్ వర్తమానం, భవిష్యత్ ఇప్పుడు సురక్షితమైన చేతుల్లో ఉందంటూ వ్యాఖ్యానించాడు. పవన్ కల్యాణ్ ‘బలమైన తుపాను’ సృష్టించారని కొనియాడాడు. కాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ప్రభంజనం సృష్టించారు. తన ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 70 వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు.
Sai Dharam Tej
Pawan Kalyan
Janasena
AP Assembly Poll Results
AP Assembly Polls

More Telugu News