Telangana: 2 లక్షల మెజార్టీతో బండి సంజయ్ గెలుపు... తెలంగాణలో 13 స్థానాల్లో గెలిచిన అభ్యర్థులు వీరే!

Rahul Gandhi won from two seats

  • 4 చోట్ల గెలిచి 4 చోట్ల ముందంజలో బీజేపీ
  • 8 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్
  • హైదరాబాద్‌ నుంచి అసదుద్దీన్ విజయం

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో  కాంగ్రెస్ 8 చోట్ల గెలిచింది. బీజేపీ 4 చోట్ల గెలిచి... నాలుగింట ముందంజలో ఉంది. మజ్లిస్ పార్టీ హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో విజయం సాధించింది. మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాలకు గాను బీఆర్ఎస్ ఎక్కడా ప్రభావం చూపలేకపోయింది.

ఆదిలాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి గోడం నగేశ్ 78వేల మెజార్టీతో విజయం సాధించారు.
నిజామాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ 1.13 లక్షల మెజార్టీతో గెలిచారు.
కరీంనగర్ నుంచి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 2.12 లక్షల మెజార్టీతో గెలిచారు.
మహబూబ్ నగర్ నుంచి బీజేపీ అభ్యర్థి డీకే అరుణ 8 వేల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు.

నల్గొండ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి 5.51 లక్షల మెజార్టీతో గెలిచారు. 
ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి 4.56 లక్షల మెజార్టీతో విజయం సాధించారు.
వరంగల్‌లో కడియం కావ్య 2.02 లక్షల మెజార్టీతో గెలిచారు.
మహబూబాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ 3.24 లక్షల మెజార్టీతో గెలిచారు.
జహీరాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ 45వేలకు పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు.
భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 1.95 లక్షల మెజార్టీతో గెలిచారు.
నాగర్ కర్నూలలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి 85 వేల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు.
పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 1.31 లక్షల మెజార్టీతో గెలిచారు.

  • Loading...

More Telugu News