AP Election Result 2024: గుడివాడలో కొడాలి నానికి ఘోర ఓటమి

Kodali Nani defeated in Gudiwada in AP Election Result 2024
  • టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో 51 వేల ఓట్ల తేడాతో పరాజయం
  • ఓట్ల లెక్కింపు జరుగుతుండగానే కౌంటింగ్ కేంద్రం వెళ్లిపోయిన నాని
  • వరుసగా నాలుగు విజయాల తర్వాత గుడివాడలో నానికి ఎదురైన ఓటమి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు-2024లో పలువురు వైఎస్సార్‌సీపీ సీనియర్ నేతలు అనూహ్య రీతిలో ఓటమి పాలైయ్యారు. ఆ జాబితాలో గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నాని (వెంకటేశ్వరరావు) కూడా చేరిపోయారు. తన ప్రత్యర్థి, టీడీపీ నేత వెనిగండ్ల రాము చేతిలో ఆయన దారుణ ఓటమిని చవిచూశారు. వెనిగండ్ల రాము ఏకంగా 51 వేల మెజారిటీతో ఘన విజయం సాధించారు. 

కాగా మాజీ మంత్రి, గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని ఓట్ల లెక్కింపు సమయంలోనే కౌంటింగ్ కేంద్రం నుంచి నిరాశగా వెనుదిరిగి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఉదయం ఫలితాల సరళిని గమనించిన ఆయన అక్కడి నుంచి వెనుదిరిగారు.

కాగా గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని 2004 నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు టీడీపీ నుంచి గెలిచిన ఆయన.. ఆ తర్వాత రెండు పర్యాయాలు వైఎస్సార్సీపీ నుంచి విజయం సాధించారు. జగన్ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు కూడా నిర్వర్తించారు.
AP Election Result 2024
AP Assembly Poll Results
Kodali Nani
YSRCP
Telugudesam
venigandla Ramu

More Telugu News