YS Jagan: పులివెందుల‌లో సీఎం జ‌గ‌న్ గెలుపు.. మెజారిటీ ఎంతంటే..!

Pulivendula Resut

  • వైఎస్‌ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి 61,687 ఓట్ల మెజారిటీ
  • జ‌గ‌న్‌కు పోలైన‌ 1,16,315 ఓట్లు
  • టీడీపీ అభ్య‌ర్థి బీటెక్ రవికి 54,628 ఓట్లు
  • కాంగ్రెస్ అభ్య‌ర్థి ధృవ్ కుమార్ రెడ్డికి 10,083 ఓట్లు

పులివెందుల‌లో వైసీపీ అభ్య‌ర్థి సీఎం వైఎస్‌ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గెలుపొందారు. స‌మీప ప్ర‌త్య‌ర్థి, టీడీపీ అభ్య‌ర్థి ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి (బీటెక్ ర‌వి) పై 61,687 ఓట్ల మెజారిటీతో జ‌గ‌న్ విజ‌యం సాధించారు. భార‌త ఎన్నిక‌ల సంఘం తెలిపిన వివ‌రాల ప్ర‌కారం జ‌గ‌న్‌కు 1,16,315 ఓట్లు రాగా.. ర‌వీంద్ర‌నాథ్ రెడ్డికి 54,628 ఓట్లు పోల‌య్యాయి. ఇక మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్య‌ర్థి ధృవ్ కుమార్ రెడ్డి 10,083 ఓట్లు ద‌క్కించుకున్నారు. 

ఇదిలాఉంటే.. ఈ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అధికార వైసీపీ భారీ షాక్ త‌గిలింది. ఆ పార్టీ కేవ‌లం 10 స్థానాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది. 2019 ఎన్నిక‌ల్లో 151 సీట్లు సాధించి ప్ర‌భంజ‌నం సృష్టించిన వైసీపీని ఈసారి ఓట‌ర్లు తిర‌స్క‌రించార‌నే చెప్పాలి. 2024 ఎన్నిక‌ల్లో టీడీపీ కూట‌మికి ఓట‌ర్లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు.

  • Loading...

More Telugu News