Lok Sabha Polls: ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పడంతో కంటతడి పెట్టుకున్న యాక్సిస్ మై ఇండియా చైర్మన్
- ఇండియా టుడే ఎన్నికల ఫలితాలపై లైవ్ కవరేజీలో పాల్గొన్న ప్రదీప్ గుప్తా
- ప్యానెల్ చర్చ సందర్భంగా ఎగ్జిట్ పోల్స్ తప్పాయంటూ భావోద్వేగం
- 69 ఎన్నికలకు సర్వే చేస్తే 65 సార్లు కరెక్ట్ అయ్యాయని వెల్లడి
లోక్ సభ ఎన్నికల ఫలితాలు... తమ ఎగ్జిట్ ఫలితాలకు భిన్నంగా ఉండటంతో యాక్సిస్ మై ఇండియా చైర్మన్, ఎండీ ప్రదీప్ గుప్తా లైవ్‌లోనే కంటతడి పెట్టుకున్నారు. ఎన్డీయేకు 361-401 మధ్య, ఇండియా కూటమికి 131-166 మధ్య సీట్లు వస్తాయని యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. అయితే ఈ అంచనాలు తప్పాయి. ఇండియా టుడే ఎన్నికల ఫలితాలపై లైవ్ కవరేజీలో ప్రదీప్ గుప్తా పాల్గొన్నారు.
ప్యానెల్ చర్చ సందర్భంగా ఎగ్జిట్ పోల్స్ అంశం గురించి ప్రస్తావిస్తూ అంచనాలు తప్పాయంటూ భావోద్వేగానికి లోనయ్యారు. యాక్సిస్ మై ఇండియా గత పదేళ్లుగా ఎగ్జిట్ పోల్స్‌ను నిర్వహిస్తోందని, రెండు లోక్ సభ ఎన్నికలు సహా మొత్తం 69 ఎన్నికలకు సర్వే చేశామని తెలిపారు. తమ అంచనాలు 65 సార్లు కరెక్ట్ అయ్యాయని పేర్కొన్నారు.