Actor Nikhil: చీరాలలో మూసివేసిన ఆలయాన్ని తెరిపించిన నటుడు నిఖిల్.. రియల్ హీరో అంటూ ప్రశంసలు

Tollywood actor Nikhil opens Temple that closed for years
  • కొన్నేళ్లుగా ఆలయం మూసివేత
  • దానిని తెరిపించి, అభివృద్ది బాధ్యతలు తీసుకున్న నటుడు
  • తమ కుటుంబానికి సేవ చేసే భాగ్యం కల్పించారంటూ గ్రామస్థులకు ధన్యవాదాలు
టాలీవుడ్ నటుడు నిఖిల్ రియల్ హీరో అనిపించుకున్నాడు. ఏళ్లుగా మూసేసిన ఆలయాన్ని తెరిపించిన ఆయన.. దాని నిర్వహణ బాధ్యతలు తీసుకున్నాడు. గొప్ప పనిచేశావంటూ గ్రామస్థులు కొనియాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని చీరాలలో కొన్ని సంవత్సరాలుగా ఓ ఆలయం మూసి ఉంది. ఈ ఆలయాన్ని తిరిగి తెరిపించిన నిఖిల్‌పై గ్రామస్థులు ఆదరాభిమానాలు కురిపిస్తున్నారు.

ఆలయాన్ని తిరిగి తెరిపించేందుకు వచ్చిన నిఖిల్‌ను పూలపై నడిపించి ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన వీడియోను పంచుకున్న నిఖిల్.. మీకు సేవ చేసే భాగ్యాన్ని తన కుటుంబానికి కల్పించారంటూ ఆనందం వ్యక్తంచేశారు. ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

ఇటీవల కార్తికేయ-2తో తిరుగులేని విజయాన్ని అందుకున్న నిఖిల్ ప్రస్తుతం స్వయంభు సినిమాలో నటిస్తున్నాడు. నిఖిల్ ఇందులో వారియర్‌గా కనిపించబోతున్నాడు. కాగా, ఇటీవల నిఖిల్ దంపతులు ఓ చిన్నారికి జన్మనిచ్చారు.
Actor Nikhil
Tollywood
Chirala
Temple

More Telugu News