Gannavaram: గన్నవరం నియోజకవర్గంలో ఎన్నికల విచిత్రం!
- ఈ ఎన్నికల్లో ఓటమిపాలైన వల్లభనేని వంశీ
- గన్నవరం నుంచి విజేతగా నిలిచిన యార్లగడ్డ వెంకట్రావు
- గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన వంశీ
- గత ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో దిగి ఓడిపోయిన యార్లగడ్డ
ఈ ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఘోరంగా ఓడిపోయారు. విచిత్రం ఏమిటంటే... వల్లభనేని వంశీ గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పుడు వంశీ చేతిలో పోయింది యార్లగడ్డ వెంకట్రావు. 2019లో జరిగిన ఆ ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగారు.
2024కి వచ్చే సరికి పరిస్థితులు తారుమారు అయ్యాయి. నాడు టీడీపీ పక్షాన గెలిచిన వల్లభనేని వంశీ ఇప్పుడు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పుడు వైసీపీ తరఫున బరిలో దిగిన యార్లగడ్డ వెంకట్రావు ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. పోటీ చేయడమే కాదు, యార్లగడ్డ గెలిచారు కూడా. అభ్యర్థులు ఎవరైనా సరే... అప్పుడూ, ఇప్పుడూ కూడా గెలిచింది టీడీపీనే... అభ్యర్థులే అటూ ఇటూ మారారు!