Vamsi: ఆ నలుగురూ నిద్రపోయేటప్పుడు తప్ప నిరంతరం కృషి చేశారు: డైరెక్టర్ వంశీ

Vamsi Interview

  • దర్శకుడిగా వంశీ స్థానం ప్రత్యేకం 
  • సినిమాకి సరైన స్క్రిప్ట్ ముఖ్యమని వెల్లడి
  • సాధన వల్లనే సక్సెస్ వస్తుందని వ్యాఖ్య 
  • ఇళయరాజా సక్సెస్ కి కారణం అదేనని వివరణ  


డైరెక్టర్ వంశీ .. తెలుగు సినిమాను తనదైన శైలిలో ప్రభావితం చేసినవారాయన. చాలా తక్కువ బడ్జెట్ లో పెద్ద హిట్లు ఇచ్చిన దర్శకుడు ఆయన. ఆ  సినిమాల్లోని పాటలు చాలావరకూ గోదావరి నేపథ్యంలోనే ఉంటాయి. అవన్నీ కూడా మ్యూజికల్ హిట్స్ గా నిలబడ్డాయి. అలాంటి వంశీ తాజా ఇంటర్వ్యూలో అనేక అంశాలను గురించి ప్రస్తావించారు.

"సినిమా బాగా రావాలి అంటే ఏం చేయాలని నన్ను చాలామంది అడిగారు. నేను చాలా గొప్ప దర్శకుల బుక్స్ చదివాను. వాళ్లంతా కూడా చెప్పిందే ఒక్కటే. మంచి సినిమా తీయాలంటే పెర్ఫెక్ట్ స్క్రిప్ట్ ఉండాలి. సరిచేయవలసిన అవసరం లేని స్క్రిప్ట్ చేతిలో ఉంటే సగం సక్సెస్ అక్కడే వచ్చేస్తుంది. అందువలన కొత్తగావచ్చే దర్శకులకు నేను ఇదేమాట చెబుతాను" అన్నారు.

"ఇండస్ట్రీకి రావాలనుకునేవారు ఒక నలుగురిని స్ఫూర్తిగా తీసుకోవాలి. బాపు గారు .. బాలూగారు .. చిరంజీవి గారు .. ఇళయరాజాగారు. వీళ్ల నలుగురూ కూడా నిద్రపోయేటప్పుడు తప్ప నిరంతరం తాము చేయవలసిన పనిని గురించే ఆలోచన చేస్తూ ఉంటారు. అందుకే ఆ స్థాయికి చేరుకోగలిగారు. ఇళయరాజా గారు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి సాధన చేస్తారు. ఇప్పటికీ అంతే .. అందువల్లనే ప్రపంచ సంగీతం ఆయన వెంట పరుగులు తీస్తోంది" అని చెప్పారు.

  • Loading...

More Telugu News