Revanth Reddy: చంద్రబాబు ఆహ్వానిస్తే ప్రమాణ స్వీకారానికి వెళతా... ఆ తర్వాత ప్రత్యేక హోదాపై మాట్లాడుతా!: రేవంత్ రెడ్డి

Revanth Reddy ready to go for Chandrababu taking oath ceremony
  • రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా ఇవ్వడానికి కట్టుబడి ఉన్నారన్న రేవంత్ రెడ్డి
  • ఈ అంశంపై పార్టీలో చర్చించాక చంద్రబాబుతో మాట్లాడుతానని స్పష్టీకరణ
  • ఏపీలో ఎవరు వచ్చినా సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకుంటామని ముందే చెప్పానన్న సీఎం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తే తప్పకుండా వెళతానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కట్టుబడి ఉన్నారన్నారు. అయితే ఈ అంశంపై పార్టీలో చర్చించాక చంద్రబాబుతో మాట్లాడుతామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా చట్టబద్ధతతో కూడుకున్న హామీ అని వెల్లడించారు. తాను కాంగ్రెస్ పార్టీ సూచనల మేరకే నడుచుకుంటానని వ్యాఖ్యానించారు.

ఏపీలో ఎన్డీయే కూటమి విజయం సాధించింది. చంద్రబాబు త్వరలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌లో ఏ ప్రభుత్వం వచ్చినా సామరస్యంగా రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకుంటామని గతంలోనే చెప్పానని గుర్తు చేశారు.
Revanth Reddy
Congress
Chandrababu
Andhra Pradesh Assembly

More Telugu News