Tycoon Junction Divider: విశాఖలో వివాదాస్పద టైకూన్ జంక్షన్ డివైడర్ ను తొలగించిన టీడీపీ, జనసేన నేతలు

TDP and Janasena leaders removes Tycoon Junction Divider in Vizag

  • విశాఖలో ఏడాదిన్నరగా సమస్యాత్మకంగా టైకూన్ జంక్షన్ డివైడర్
  • అప్పటి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కోసం డివైడర్ ఏర్పాటు చేశారని విమర్శలు
  • రంగంలోకి దిగి డివైడర్ ను తొలగించిన గండి బాబ్జీ, పీతల మూర్తి యాదవ్

విశాఖపట్నంలో గత ఏడాదిన్నరగా వివాదాస్పదంగా మారిన టైకూన్ జంక్షన్ డివైడర్ ను ఇవాళ టీడీపీ, జనసేన నేతలు తొలగించారు. వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కోసం పోలీసులు టైకూన్ జంక్షన్ ను మూసివేశారన్న ఆరోపణలు ఉన్నాయి. 

ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించిన నేపథ్యంలో... టీడీపీ, జనసేన నేతలు టైకూన్ జంక్షన్ పునరుద్ధరణకు రంగంలోకి దిగారు. ఇవాళ పెందుర్తి టీడీపీ ఇన్చార్జి గండి బాబ్జీ, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్, జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ నేతృత్వంలో టైకూన్ జంక్షన్ డివైడర్ ను జేసీబీ సాయంతో తొలగించారు. 

సమస్యాత్మకంగా ఉన్న ఈ డివైడర్ ను తొలగించడం పట్ల విశాఖ ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇక్కడికి దగ్గర్లో అనేక స్కూళ్లు ఉన్నాయని, పిల్లల్ని తీసుకెళ్లాలంటే ఇన్నాళ్లు ఈ డివైడర్ వల్ల చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడా బాధ తొలగిపోయిందని స్థానికులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News