V.V Lakshminarayana: కొత్త ప్రభుత్వానికి హోదా డిమాండ్ చేసేందుకు ఇదే సమయం: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్య

JD Laxminarayana interesting comments on Special Status to AP

  • కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి లక్ష కోట్లకు పైగా బడ్జెట్ కావాలని వెల్లడి
  • అన్ని హామీలు నెరవేరాలంటే ప్రత్యేక హోదానే మార్గమని సూచన
  • బీజేపీకి మెజార్టీ ఉన్నందునే అడగలేకపోతున్నామని జగన్ చెప్పారని గుర్తు చేసిన లక్ష్మీనారాయణ
  • ఇప్పుడు బీజేపీకి మెజార్టీ లేనందున కొత్త ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలని సూచన

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మార్పుపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి లక్ష కోట్లకు పైగా బడ్జెట్ కావాలన్నారు. అన్ని హామీలు నెరవేరాలంటే ప్రత్యేక హోదానే మార్గమని సూచించారు. కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజార్టీ ఉన్నందున హోదాను డిమాండ్ చేయలేకపోతున్నామని గతంలో జగన్ పలుమార్లు చెప్పారని... కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి డిమాండ్ చేసే అవకాశం వచ్చిందన్నారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేంద్రంలో ప్రస్తుతం బీజేపీకి 240 సీట్లు మాత్రమే ఉన్నాయని... ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకొని ఏపీకి ప్రత్యేక హోదాను సాధించాలని సూచించారు. విశాఖ రైల్వే జోన్ వెంటనే ప్రారంభమయ్యేలా చూడాలని సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేయాలని కోరారు. ఈ ఐదేళ్లు చాలా కీలకమని... ఇప్పుడు అభివృద్ధి చేయకపోతే రాష్ట్రం బాగుపడదని హెచ్చరించారు. రాష్ట్ర ఆదాయం పెరిగితేనే అభివృద్ధితో పాటు సంక్షేమానికి వీలవుతుందన్నారు. కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడానికి... గత ప్రభుత్వం చేసిన అప్పుల కంటే ఎక్కువగా చేయాల్సి వస్తుందన్నారు.

  • Loading...

More Telugu News