Vivo: భారత్‌లో అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ విడుదల చేసిన వివో
- తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ‘వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో విడుదల చేసిన కంపెనీ
- ధర రూ.1,59,999గా ప్రకటించిన వివో
- చైనా మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్
స్మార్ట్‌ఫోన్ల తయారీ దిగ్గజం వివో (Vivo) భారత్ మార్కెట్‌లో తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ‘వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో’ను విడుదల చేసింది. భారత్‌లో కొత్తగా విడుదలైనప్పటికీ చైనా మార్కెట్లో ఇప్పటికే అమ్మకాలు కొనసాగుతున్నాయి.
ధర రూ.1,59,999
వివో ఎక్స్ ఫోల్డ్ 3 సెలెస్టియల్ బ్లాక్ కలర్ ఫోన్ ధర రూ.1,59,999గా ఉంది. 16జీబీ ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్లతో ఈ ఫోన్ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం వివో ఇండియా అఫీషియల్ వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లపై ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. జూన్ 13 నుంచి అమ్మకాలు మొదలవుతాయని వివో వెల్లడించింది. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ కార్డ్‌లను ఉపయోగించి రూ. 15,000 వరకు తగ్గింపు ఆఫర్లు పొందవచ్చు. ఇక ఎక్స్చేంజ్‌పై రూ.10,000, వన్-టైమ్ ఫ్రీ స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను కూడా యూజర్లు పొందవచ్చు. 24 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా వివో ఆఫర్ చేస్తోంది.
ఫీచర్లు ఇవే...
ఆక్టా-కోర్ స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 3 చిప్ ఆధారంగా ఈ ఫోన్ పనిచేయనుంది. జీస్-బ్రాండెడ్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 8.03-అంగుళాల అమోలుడ్ ఇన్నర్ స్క్రీన్‌తో పాటు ఇతర ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, డాల్బీ విజన్ సపోర్ట్, 120హెడ్జ్ వరకు రిఫ్రెష్ రేట్‌ను అందించే రెండు స్క్రీన్‌లు ఉన్నాయి. మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 3 రెట్లు జూమ్‌తో కూడిన 64-మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్, స్మార్ట్‌ఫోన్ 5G, వై-ఫై 7, బ్లూటూత్ 5.4, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్‌తో పాటు ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఇక ఈ ఫోన్ బ్యాటరీ కెపాసిటీ 5,700ఎంఏహెచ్‌గా ఉంది. 100 వాట్స్ వైర్డు, 50వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.