Lok Sabha Election Results: లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ... సీడబ్ల్యూసీ తీర్మానం

CWC passes resolution to appoint Rahul Gandhi as Leader of Opposition
  • త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటానని రాహుల్ గాంధీ చెప్పినట్లు వెల్లడించిన కాంగ్రెస్ వర్గాలు
  • రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉండాలని తామంతా కోరుకుంటున్నామని వెల్లడి
  • ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ కృషిని కొనియాడిన సీడబ్ల్యూసీ
లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకునేందుకు సీడబ్ల్యూసీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ అంగీకరించే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటానని రాహుల్ గాంధీ చెప్పినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈరోజు ఢిల్లీలో సీడబ్ల్యూసీ విస్తృత సమావేశం జరిగింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మనీశ్ తివారీ, డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది.

సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ... రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉండాలని తామంతా కోరుకుంటున్నామన్నారు. ఇది వర్కింగ్ కమిటీ అభ్యర్థన అన్నారు. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ కృషిని కూడా సీడబ్ల్యూసీ కొనియాడినట్లు చెప్పారు.
Lok Sabha Election Results
Rahul Gandhi

More Telugu News