Narendra Modi: కేంద్రమంత్రులుగా నేడు 30 మంది ప్రమాణస్వీకారం!

National media said that 30 Ministers may Take Oath As Modi cabinet ministers Today
  • పూర్తి స్థాయి మంత్రి మండలిలో 78 నుంచి 81 మంది మంత్రులు ఉండొచ్చని అంచనా
  • కీలక శాఖలు బీజేపీ వద్ద ఉండనున్నట్టు విశ్లేషణలు
  • నేడు కొలువు తీరనున్న ‘మోదీ 3.0’ ప్రభుత్వం
  • రాత్రి 7.15 గంటలకు దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం
‘మోదీ 3.0’ ప్రభుత్వం నేడు (ఆదివారం) కొలువు తీరనుంది. ఇవాళ రాత్రి 7.15 గంటలకు దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ, అనంతరం పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే మంత్రులుగా ఎవరెవరు నేడు ప్రమాణం చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీ వర్గాల సమాచారం మేరకు ఈ రోజు 30 మంది నేతలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ఒకటి కంటే ఎక్కువ పోర్ట్‌ఫొలియోలను కలిగివుండే మంత్రుల సంఖ్య చాలా తక్కువగా ఉండనుందని తెలుస్తోంది. పూర్తి స్థాయి మంత్రి మండలిలో 78 నుంచి 81 మంది మంత్రులు ఉండే అవకాశం ఉందని ఎన్డీటీవీ కథనం పేర్కొంది.

నరేంద్ర మోదీ కేబినెట్‌లో పలువురు మాజీ ముఖ్యమంత్రులు కూడా చేరే అవకాశం ఉందని ఎన్డీటీవీ కథనం పేర్కొంది. ఇక కీలకమైన హోంశాఖ, రక్షణ, ఆర్థిక, విదేశీ వ్యవహారాల శాఖలు బీజేపీ వద్దనే ఉండనున్నాయని విశ్లేషించింది. మౌలిక సదుపాయాలకు సంబంధించి కీలకమైన శాఖలైన ఉక్కు, పౌర విమానయాన, బొగ్గు మంత్రిత్వ శాఖలను కూడా బీజేపీ అట్టిపెట్టుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

ప్రధానిగా నేడు ప్రమాణస్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ.. వరుసగా మూడు పర్యాయాలు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండవ వ్యక్తిగా నిలవనున్నారు. మోదీ కంటే ముందు జవహర్‌లాల్ నెహ్రూ 1952, 1957, 1962లలో వరుసగా మూడుసార్లు దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
Narendra Modi
Central Government
BJP
Modi cabinet ministers
Modi 3.0

More Telugu News