Sania Mirza: పవిత్ర హజ్ యాత్రకు బయల్దేరిన సానియా మీర్జా

Sania Mirza set to make divine Hajj Yatra

  • కొన్నాళ్ల కిందట పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడిన సానియా
  • సానియా, షోయబ్ లకు ఓ కుమారుడు
  • కొంతకాలం నుంచి విడిగా ఉంటున్న సానియా
  • హజ్ నుంచి మెరుగైన వ్యక్తిగా తిరిగొస్తానని వెల్లడి

భారత టెన్నిస్ రారాణి సానియా మీర్జా వైవాహిక జీవితం విచ్ఛిన్నం కావడం తెలిసిందే. కొన్నేళ్ల కిందట పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడిన సానియా... కొంతకాలంగా భర్త నుంచి వేరుగా ఉంటోంది. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో ఓ చానల్ కు కామెంటేటర్ గా వ్యవహరించిన సానియా... తాజాగా కుటుంబ సభ్యులతో కలిసి పవిత్ర హజ్ యాత్రకు బయల్దేరారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేశారు. 

హజ్ యాత్రకు వెళ్లే దివ్యమైన అవకాశాన్ని ఆ భగవంతుడు తనకు అందించాడని సానియా వెల్లడించారు. తన జీవిత పరివర్తన అనుభూతికి సిద్ధమవుతున్నానని, ఆధ్యాత్మిక భావనలతో తన హృదయం నిండిపోయిందని తెలిపారు. అందుకు కృతజ్ఞురాలినని పేర్కొన్నారు. 

తాను ఏవైనా తప్పిదాలకు, పొరపాట్లకు పాల్పడి ఉంటే మనస్ఫూర్తిగా క్షమించాలని కోరుతున్నట్టు సానియా వివరించారు. అల్లా నా ప్రార్థనలను ఆలకిస్తాడని నమ్ముతున్నానని, నన్ను సన్మార్గంలో తీసుకెళతాడన్న నమ్మకంతో ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. 

జీవితకాలంలో ఎంతో పవిత్రమైనదిగా భావించే హజ్ యాత్రకు వెళుతున్న సందర్భంగా నా గురించి ప్రార్థించండి అని కోరారు. హజ్ నుంచి స్వచ్ఛమైన హృదయంతో, బలమైన విశ్వాసంంతో ఓ మంచి వ్యక్తిగా తిరిగివస్తానని సానియా వివరించారు.

  • Loading...

More Telugu News