Kinjarapu Ram Mohan Naidu: మోదీ కేబినెట్: పిన్న వయస్కుడు రామ్మోహన్ నాయుడు, వృద్ధనేత మాంఝీ
- శ్రీకాకుళం నుంచి టీడీపీ ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడు
- బీహార్‌లోని గయ నుంచి విజయం సాధించిన మాంఝీ
- యువ మంత్రుల్లో రక్షా ఖడ్సే, చిరాగ్ పాశ్వాన్, జయంత్ చౌదరి
ప్రధాని నరేంద్రమోదీ కొత్త కేబినెట్లో కొత్తగా మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో అత్యంత పిన్న వయస్కుడు ఏపీకి చెందిన కింజారపు రామ్మోహన్ నాయుడు కాగా, వృద్ధ నేత జీతన్ రామ్ మాంఝీ. 36 ఏళ్ల రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా విజయం సాధించారు. సార్వత్రిక ఎన్నికల్లో సమీప వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్‌పై 3.27 లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచారు.
మరో యువనేత... 37ఏళ్ల రక్షా ఖడ్సే మహారాష్ట్రలోని రేవర్ స్థానం నుంచి గెలిచారు. లోక్ జనశక్తి చీఫ్ చిరాగ్ పాశ్వాన్, ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరి తొలిసారి కేంద్రమంత్రులుగా ప్రమాణం చేశారు.
కొత్తగా ప్రమాణం చేసిన వారిలో అత్యంత వృద్ధనేత జీతన్ రామ్ మాంఝీ (79). ఆయన బీహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. 2015లో ఆయన హిందుస్తానీ అవామీ మోర్చా పార్టీని స్థాపించరు. సార్వత్రిక ఎన్నికల్లో గయ నుంచి గెలిచారు.