Health: అవి అనారోగ్య సమస్యలు కావు.. ఈ అపోహలు మీకూ ఉన్నాయా?
- శరీరంలో ఇబ్బందులపై చాలా మందికి అనేక అపోహలు
- శరీరంలో ఇబ్బందులకు కారణమవుతున్న జీవన శైలి, మానసిక ఒత్తిడి
- అవగాహన లేకపోవడంతో ఆందోళన చెందుతున్న జనం
శరీరంలో ఇబ్బందులపై చాలా మందికి అనేక అపోహలు ఉంటాయి. కొందరైతే శరీరంలో చిన్న నొప్పి వచ్చినా.. ఏ చిన్న ఇబ్బంది కలిగినా ఏదో జరిగిపోతోందని తెగ కలవర పడిపోతుంటారు. ఏదేదో ఊహించుకొని ఆందోళన చెందుతుంటారు. హాస్పిటల్స్‌కు పరుగులు పెడుతుంటారు. కానీ రోజువారీ జీవనశైలి, మానసిక ఒత్తిడి, ఇతర కారణాలతో శరీరంలో చాలా ఇబ్బందులు చోటు చేసుకుంటుంటాయి. ఫలితంగా శరీరం అసౌకర్యాలకు గురవుతుంటుంది.
అయితే అనివార్యంగా ఏర్పడే ఈ శారీరక ఇబ్బందుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. మానసిక ఒత్తిడి తొలుత మెదడుపై.. ఆ తర్వాత ఇతర శరీర భాగాలపై దుష్ప్రభావాలు చూపుతుందని, వాటిపై అవగాహన ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. మరి అనారోగ్య అపోహలపై అవగాహన కోసం ‘ఏపీ7ఏఎం’ అందిస్తోన్న ఈ వీడియోలో సమాచారం మీరు కూడా తెలుసుకోండి.
అనారోగ్యం వెనుక మరేదో కారణం .. మీ శరీరం చెప్పేది శ్రద్ధగా వినండి!