Donkeys: పాకిస్థాన్ లో విపరీతంగా పెరిగిన గాడిదల సంతతి

Donkeys numbers increased in Pakistan

  • పాక్ లో 80 లక్షల కుటుంబాలకు పశు పోషణే ఆధారం
  • 2019-20లో దేశంలో గాడిదల సంఖ్య 55 లక్షలు
  • ఈ ఆర్థిక సంవత్సరంలో 59 లక్షలకు పెరిగిన గాడిదల సంఖ్య

భారత్ కు పొరుగునే ఉన్న దాయాది దేశం పాకిస్థాన్. పాక్ లో అధిక జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తోంది. దాదాపు 80 లక్షల కుటుంబాలు పశు పోషణపైనే ఆధారపడి ఉన్నాయి. సరిగ్గా చెప్పాలంటే, పాక్ ఆర్థిక వ్యవస్థకు పశు సంపదే ఆధారం. 

తాజాగా, పాక్ లో గాడిదల సంతతి విపరీతంగా పెరిగిపోయింది. ఆ దేశ పరిస్థితి దృష్ట్యా ఇది నిజంగా శుభ పరిణామమే. 2019-20లో ఆర్థిక సంవత్సరంలో గాడిదల జనాభా 55 లక్షలు కాగా, తాజా ఆర్థిక సంవత్సరంలో వాటి సంఖ్య 59 లక్షలకు పెరిగింది. పాక్ ఆర్థిక మంత్రి మహ్మద్ ఔరంగజేబ్ సమర్పించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. గాడిదల జనాభా ఏటా లక్ష చొప్పున పెరుగుతూ వస్తోందట. 

అదే సమయంలో పశువులు, మేకలు, గొర్రెల సంతతి కూడా పెరిగినట్టు మంత్రి వెల్లడించారు. పాక్ లో ఆర్థిక సంక్షోభం అంతకంతకు ముదురుతున్న నేపథ్యంలో, పశు ఉత్పత్తి రంగానికి సంబంధించి సానుకూల నివేదికలు రావడం అక్కడి ప్రభుత్వానికి ఊరట కలిగించే విషయం.

  • Loading...

More Telugu News