Varalaxmi Srath Kumar: పెళ్లి పత్రికలు పంచుతున్న వరలక్ష్మి శరత్ కుమార్... ఫొటోలు ఇవిగో!
- కొన్నాళ్ల కిందట వరలక్ష్మి శరత్ కుమార్ నిశ్చితార్థం
- జులైలో వివాహం
- ప్రముఖులను స్వయంగా తన పెళ్లికి ఆహ్వానిస్తున్న వరలక్ష్మి
ప్రముఖ దక్షిణాది నటి వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలోనే ఓ ఇంటి వారు కాబోతున్నారు. ముంబయి ఆంట్రప్రెన్యూర్, ఆర్ట్ ఎగ్జిబిషనిస్ట్ నికోలాయ్ సచ్ దేవ్ తో ఆమెకు కొన్నాళ్ల కిందట నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. జులైలో వీరి వివాహం జరగనుంది.
ఈ నేపథ్యంలో, వరలక్ష్మి తన పెళ్లికి రావాలంటూ ప్రముఖులకు శుభలేఖలు పంచుతున్నారు. రవితేజ, మురళీ శర్మ, తమన్, కిచ్చ సుదీప్, అడివి శేష్, వంశీ పైడిపల్లి, హరీశ్ శంకర్, గోపీచంద్ మలినేని, యర్నేని నవీన్, ప్రశాంత్ వర్మ తదితరులకు ఆమె పెళ్లి కార్డులు అందించారు.