Yediyurappa: యడియూరప్పకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
- ఫోక్సో కేసులో వారెంట్ జారీ చేసిన బెంగళూరు స్పెషల్ కోర్టు
- 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో యడియూరప్పపై కేసు నమోదు
- విచారణకు హాజరు కావాలని ఇప్పటికే సీఐడీ నోటీసులు
- రేపు విచారణకు హాజరవుతానని చెప్పిన మాజీ సీఎం
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యడియూరప్పకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఫోక్సో కేసులో ఆయనకు బెంగళూరు స్పెషల్ కోర్టు ఈ వారెంట్‌ను జారీ చేసింది. దర్యాఫ్తు సంస్థ ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో యడియూరప్పపై కేసు నమోదయింది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని సీఐడీ... మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు హాజరవుతానని ఆయన దర్యాఫ్తు సంస్థకు సమాధానం ఇచ్చారు.