Diarrhea: కాకినాడలో డయేరియా పంజా.. 50 మందికి అస్వస్థత!

Diarrhea Rampant in Kommanapally of Kakinada District

  • కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లిలో ప్ర‌బ‌లిన డయేరియా
  • వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిలో చేరుతున్న గ్రామస్తులు 
  • కాకినాడ జీజీహెచ్‌కి తీవ్రంగా ఇబ్బంది ప‌డుతున్న ఐదుగురి త‌ర‌లింపు

కాకినాడ జిల్లాలో డయేరియా (అతిసారం) పంజా విసురుతోంది. తొండంగి మండలం కొమ్మనాపల్లి వాసులు డయేరియా బారిన పడుతున్నారు. సుమారు 50 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో గ్రామస్తులు ఆసుపత్రిలో చేరుతున్నారు. దీంతో ప్ర‌స్తుతం అక్క‌డ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామ సచివాలయంలో పలువురికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా ఇబ్బంది ప‌డుతున్న ఐదుగురు బాధితుల‌ను కాకినాడ ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితులను డీఎంహెచ్ఓ పరిశీలించారు. వాటర్ ట్యాంక్ లో నీటిని టెస్టింగ్ కోసం పంపించారు. 

ఈ ఘటనపై తుని ఎమ్మెల్యే యనమల దివ్య స్పందించారు. కొమ్మనాపల్లి గ్రామంలో 34 మంది అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. అందులో పది మంది కోలుకున్నారని ఆమె చెప్పారు. ఫుడ్ పాయిజన్, కలుషిత నీరు అస్వస్థతకి కారణంగా తెలిసింద‌ని, అధికారులు ఇప్పటికే శాంపిల్స్ కలెక్ట్ చేసి టెస్టులకి పంపించారని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. ఇబ్బంది ఉన్నవారిని కాకినాడ జీజీహెచ్‌కి తరలించే ఏర్పాటు చేస్తున్నార‌ని యనమల దివ్య పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News