Krishna Teja: తెలుగు ఐఏఎస్ అధికారి కృష్ణతేజకు జాతీయ అవార్డు
- కేరళ క్యాడర్ లో వన్నెలీనుతున్న కృష్ణతేజ
- ప్రస్తుతం త్రిస్సూర్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న వైనం
- బాలల హక్కుల పరిరక్షణలో దేశంలోనే నెంబర్ వన్ గా త్రిస్సూర్ జిల్లా
- బాలల హక్కుల కోసం తీవ్రంగా కృషి చేసిన కృష్ణతేజ
కేరళ క్యాడర్ తెలుగు ఐఏఎస్ అధికారి కృష్ణతేజకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. కృష్ణతేజను జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ అవార్డు వరించింది. కృష్ణతేజ ప్రస్తుతం కేరళలోని త్రిస్సూర్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు. బాలల హక్కుల రక్షణలో త్రిస్సూర్ జిల్లా దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. దీని వెనుక జిల్లా కలెక్టర్ కృష్ణతేజ కృషి ఎంతో ఉంది. త్వరలోనే ఆయన ఈ పురస్కారం అందుకోనున్నారు.
కృష్ణతేజ ఎంతో సమర్థుడైన అధికారిగా గుర్తింపు పొందారు. కేరళలో వరదలు ప్రళయం సృష్టించిన సమయంలో ఆయన చూపించిన చొరవ జాతీయ స్థాయిలో ఆకట్టుకుంది. ఆ సమయంలో కృష్ణతేజ అలెప్పీ జిల్లా సబ్ కలెక్టర్ గా ఉన్నారు.
ఆ తర్వాత కాలంలో ఆయనను కేరళ పర్యాటక శాఖ డైరెక్టర్ గా నియమించారు. అనంతరం త్రిస్సూర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు అందుకున్నారు.