Kuwait Fire Accident: కువైట్ అగ్నిప్రమాదంలో మరణించిన ఏపీ కార్మికులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు
- కువైట్ లోని ఓ అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం
- 45 మంది భారతీయుల మృత్యువాత
- అందులో ముగ్గురు ఏపీ కార్మికులు
- తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
కువైట్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 45 మంది భారతీయులు మృతి చెందిన సంగతి తెలిసిందే. వారి మృతదేహాలు ఇవాళ భారత్ చేరుకున్నాయి. మృతుల్లో ముగ్గురు ఏపీ వాసులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాల పరిస్థితి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.