YS Jagan: హైదరాబాదులో మాజీ సీఎం జగన్ నివాసం వద్ద అక్రమ నిర్మాణాల తొలగింపు

Illegal structures demolished at YS Jagan residence in Hyderabad

  • హైదరాబాదులోని లోటస్ పాండ్ వద్ద జగన్ నివాసం
  • ఫుట్ పాత్ ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని స్థానికుల ఫిర్యాదు
  • రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు

హైదరాబాదు లోటస్ పాండ్ లోని ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం వద్ద అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. జగన్ భద్రత కోసం అంటూ నిర్మించిన ఈ సెక్యూరిటీ అవుట్ పోస్టు కట్టడాలకు అనుమతులు లేవని ఆరోపణలు వచ్చాయి. రోడ్డును ఆక్రమించి ఈ నిర్మాణాలు చేపట్టారని, ఇవి ప్రజలకు అసౌకర్యకంగా కలిగిస్తున్నాయని, ట్రాఫిక్ కు ఇబ్బందికరంగా మారాయని ఫిర్యాదులు అందాయి. 

ఈ ఫిర్యాదుల నేపథ్యంలో, జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి, జగన్ నివాసం ఎదుట ఉన్న పలు నిర్మాణాలను జేసీబీల సాయంతో కూల్చివేశారు. కాగా, జీహెచ్ఎంసీ చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఇకపై ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News