Karnataka: కర్ణాటక ప్రజలకు షాక్... పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచిన ప్రభుత్వం

Karnataka govt hikes petrol diesel prices by Rs 3 per litre

  • పెట్రోల్, డీజిల్‌లపై ఒక్కో లీటర్ మీద రూ.3 పెంచుతూ నిర్ణయం
  • పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయన్న కాంగ్రెస్ ప్రభుత్వం
  • పెరిగిన ధరలతో ఏడాదికి రూ.2,800 కోట్ల వరకు అదనపు ఆదాయం

కర్ణాటక ప్రజలకు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం షాకిచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ సిద్ధరామయ్య ప్రభుత్వం నేడు నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఒక్కో లీటర్ పైన 3 రూపాయలు పెంచింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, కర్ణాటక సేల్స్ ట్యాక్స్ (కె.ఎస్‌.టి) పెట్రోల్‌పై 25.92 శాతం నుండి 29.84 శాతానికి, డీజిల్‌పై 14.3 శాతం నుండి 18.4 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

అఖిల కర్ణాటక పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రకారం, పెట్రోల్ లీటర్ పెట్రోల్‌పై రూ.3, లీటర్ డీజిల్‌పై రూ.3.02 పెరిగింది. దీంతో బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.102.86కు, డీజిల్ ధర రూ.88.94కు చేరుకుంది. ఈ పెరిగిన ధర తక్షణమే అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ తెలిపింది. పెరిగిన ధరల కారణంగా ఏడాదికి అదనంగా రూ.2,500 కోట్ల నుంచి రూ.2,800 కోట్ల ఆదాయం సమకూరనుంది.

  • Loading...

More Telugu News