Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు వదిన సురేఖ స్పెషల్ గిఫ్ట్... వీడియో షేర్ చేసిన చిరంజీవి

AP Deputy CM Pawan Kalyan receives special gift from Konidela Surekha
  • పవన్ కు కూటమి ప్రభుత్వంలో విశిష్ట స్థానం
  • డిప్యూటీ సీఎం పదవితో పాటు పలు శాఖల కేటాయింపు
  • పవన్ కు ఖరీదైన ఫౌంటెన్ పెన్ బహూకరించిన సురేఖ
  • వదిన కానుకతో మురిసిపోయిన జనసేనాని
జనసేనాని, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా నియమితులు  కావడం తెలిసిందే. ఆయనకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. 

ఈ నేపథ్యంలో, పవన్ కల్యాణ్ కు వదిన సురేఖ నుంచి అపురూపమైన కానుక లభించింది. తెలుగు ప్రజల ఆశలు నెరవేర్చాలంటూ స్పెషల్ గిఫ్ట్ అందజేశారు. ఓ ఫౌంటెన్ పెన్ ను ఆమె తన మరిదికి బహూకరించారు. వదినమ్మ నుంచి అందిన స్పెషల్ గిఫ్ట్ చూసి పవన్ కల్యాణ్ అమితానందం వ్యక్తం చేశారు. 

ఆ ఖరీదైన పెన్నును జాగ్రత్తగా జేబులో పెట్టుకున్నారు. ఈ సందర్భంగా పవన్, అన్నా లెజనోవా, సురేఖ, మెగాస్టార్ చిరంజీవి ఫొటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను చిరంజీవి సోషల్ మీడియాలో  పంచుకున్నారు. కల్యాణ్ బాబుకు వదినమ్మ బహుమతి అని పేర్కొన్నారు.
Pawan Kalyan
Special Gift
Konidela Surekha
Pen
Deputy CM
Janasena
Andhra Pradesh

More Telugu News