Chenab Railway Bridge: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనదిగా చీనాబ్ బ్రిడ్జి రికార్డు.. త్వరలో రైలు సర్వీసుల ప్రారంభం

Railways conduct first trial run of worlds highest Chenab rail bridge in Jammu Kashmir

  • కశ్మీర్‌లోని రాంబన్ జిల్లా సాంగ్లదాన్, రియాసీ జిల్లాలను కలుపుతూ వంతెన నిర్మాణం
  • వంతెనపై ప్రయోగాత్మకంగా రైలును నడిపిన రైల్వే శాఖ
  • త్వరలో రైలు సర్వీసులు ప్రారంభం
  • ట్రయల్ రన్ వీడియోను షేర్ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చినాబ్ బ్రడ్జి నిర్మాణం దాదాపుగా పూర్తయ్యింది. ఇటీవలే రైల్వే శాఖ వంతెనపై రైలును ప్రయోగాత్మకంగా నడిపింది. ఈ పరీక్ష విజయవంతమైందని, త్వరలో వంతెనపై రైలు సర్వీసులు ప్రారంభమవుతాయని ఉత్తర రైల్వే విభాగం పేర్కొంది. జమ్మూ కశ్మీర్ లోని రాంబన్ జిల్లా సాంగల్దాన్ నుంచి రియాసీ జిల్లాను కలుపుతూ ఈ వంతెనను నిర్మించారు. ట్రయల్ రన్ విజయవంతమవడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించారు.  ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. త్వరలో రైలు సర్వీసులు ప్రారంభమవుతాయని అన్నారు. 

భారత్ లో ప్రస్తుతం కన్యాకుమారి నుంచి కత్రా.. కశ్మీర్ లోయలోని బారాముల్లా నుంచి సంగల్దాన్ వరకూ రైల్వే సేవలు కొనసాగుతున్నాయి. తాజాగా పూర్తయిన ఈ వంతెన ప్రజలకు అత్యంత ఉపయోగకరంగా మారనుంది. 

రైలు మార్గం ద్వారా కశ్మీర్ ను భారత్ లోని మిగతా ప్రాంతాలకు అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపూర్ - శ్రీనగర్ - బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో ఇది భాగం. చీనాబ్ నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు. దీని పొడవు 1315 మీటర్లు. ఇప్పటివరకూ చైనాలోని బెయిపాన్ నదిపై ఉన్న షుబాయ్ రైల్వే వంతెన (275 మీటర్ల ఎత్తు) పేరుతో ఉన్న ప్రపంచరికార్డును ఇది అధిగమించింది. ప్రపంచప్రఖ్యాత ఈఫిల్ టవర్ కంటే చీనాబ్ వంతెన ఎత్తు 30 మీటర్లు ఎక్కువ.

  • Loading...

More Telugu News