T20 World Cup 2024: సూపర్ -8లో ఆడే జట్లు.. మ్యాచ్‌ల‌ పూర్తి షెడ్యూల్ ఇదే..!

T20 World Cup Super 8 Teams And Matchs Dates Details Here

  • టీ20 ప్ర‌పంచ‌కప్ 2024లో ముగిసిన లీగ్ దశ
  • జూన్ 19 నుంచి 25వ తేదీ వ‌ర‌కు సూప‌ర్-8 మ్యాచులు
  • రెండు గ్రూపులుగా సూప‌ర్-8కి చేరిన 8 జ‌ట్ల‌ విభ‌జ‌న‌ 
  • గ్రూప్-1లో భారత్, ఆస్ట్రేలియా, ఆఫ్గ‌నిస్థాన్, బంగ్లాదేశ్ 
  • గ్రూప్-2లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, అమెరికా, ఇంగ్లండ్ 
  • జూన్ 20, 22, 24 తేదీల్లో టీమిండియా మ్యాచులు

టీ20 ప్ర‌పంచ‌కప్ 2024లో లీగ్ దశ ముగిసింది. నేపాల్‌పై బంగ్లాదేశ్‌ ఘన విజయం సాధించడంతో సూపర్-8కు అర్హత సాధించిన జట్లు అధికారికంగా ఖరారయ్యాయి. గ్రూప్-ఏ నుంచి భారత్, అమెరికా.. గ్రూప్-బీ నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. గ్రూప్-సీ నుంచి ఆఫ్గ‌నిస్థాన్, వెస్టిండీస్.. గ్రూప్-డీ నుంచి దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ సూప‌ర్‌-8కి క్వాలిఫై అయ్యాయి. ఈ 8 జట్లను ముందుగా నిర్ణయించిన సీడింగ్ ద్వారా రెండు గ్రూప్‌లుగా విభజించారు. జూన్ 19 నుంచి 25వ తేదీ వ‌ర‌కు సూప‌ర్-8 మ్యాచులు జ‌రుగుతాయి.

గ్రూప్-1లో భారత్, ఆస్ట్రేలియా, ఆఫ్గ‌నిస్థాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి. 
గ్రూప్-2లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, అమెరికా, ఇంగ్లండ్ నిలిచాయి. 


ఇక సూపర్ -8లో రోహిత్ సేన‌ మూడు మ్యాచ్‌లు ఆడనుంది. జూన్ 20న బార్బడోస్‌లో ఆఫ్గ‌నిస్థాన్‌తో, జూన్ 22న ఆంటిగ్వాలో బంగ్లాదేశ్‌తో, జూన్ 24న సెయింట్ లూసియాలో ఆస్ట్రేలియా జట్టుతో తలపడుతుంది. టీమిండియా మ్యాచులన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మొదలవుతాయి. 

సూపర్-8 పూర్తి షెడ్యూల్ ఇలా..
జూన్ 19: అమెరికా వర్సెస్ ద‌క్షిణాఫ్రికా (ఆంటిగ్వా- రాత్రి 8 గంటలకు)
జూన్ 20: ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ (లూసియా- ఉదయం 6 గంటలకు)
జూన్ 20: భారత్ వర్సెస్ ఆఫ్గనిస్థాన్ (బార్బడోస్- రాత్రి 8 గంటలకు)
జూన్ 21: ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ (బార్బడోస్- ఉదయం 6 గంటలకు)
జూన్ 21: ఇంగ్లండ్ వర్సెస్ ద‌క్షిణాఫ్రికా (లూసియా- రాత్రి 8 గంటలకు)
జూన్ 22: అమెరికా వర్సెస్ వెస్టిండీస్ (బార్బడోస్- ఉదయం 6 గంటలకు)
జూన్ 22: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా- రాత్రి 8 గంటలకు)
జూన్ 23: ఆఫ్గనిస్థాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (విన్సెంట్- ఉదయం 6 గంటలకు)
జూన్ 23: అమెరికా వర్సెస్ ఇంగ్లండ్ (బార్బడోస్- రాత్రి 8 గంటలకు)
జూన్ 24: వెస్టిండీస్ వర్సెస్ ద‌క్షిణాఫ్రికా (ఆంటిగ్వా- రాత్రి 6 గంటలకు)
జూన్ 24: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (లూసియా- రాత్రి 8 గంటలకు)
జూన్ 25: ఆఫ్గనిస్థాన్ వర్సెస్ బంగ్లాదేశ్ (విన్సెంట్- ఉదయం 6 గంటలకు)

  • Loading...

More Telugu News