Khairatabad Ganapati: ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహ నిర్మాణానికి నేడు ఘనంగా కర్ర పూజ

Khairatabad Ganapati idol making process has begun

  • నేడు ఏకాదశి
  • ఖైరతాబాద్ గణపతి విగ్రహ తయారీకి అంకురార్పణ
  • కర్రపూజలో పాల్గొన్న దానం నాగేందర్, గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు

వినాయకచవితి సందర్భంగా హైదరాబాదులోని ఖైరతాబాద్ లో ప్రతిష్ఠించే మహా గణపతి విగ్రహానికి దేశవ్యాప్త గుర్తింపు ఉంది. భారీతనంలోనూ, ప్రజాకర్షణ విషయంలోనూ ఖైరతాబాద్ గణపతికి సాటి లేదు. అందుకే ప్రతి ఏటా ఖైరతాబాద్ లో గణపతి విగ్రహం ఎత్తు ఎంత అనే అంశంపై అత్యంత ఆసక్తి నెలకొంటుంది. 

ఇక, ఈసారి వినాయక చవితి సందర్భంగా ప్రతిష్ఠాపన చేసే విగ్రహ నిర్మాణం కోసం నేడు ఘనంగా కర్ర పూజ నిర్వహించారు. ప్రతి ఏడాది నిర్మల ఏకాదశి నాడు కర్ర పూజ నిర్వహించడం ఆనవాయతీగా వస్తోంది. కర్రపూజ అనంతరం విగ్రహాన్ని ఇక్కడే రూపొందిస్తారు.  

నేడు జరిగిన ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈసారి ఖైరతాబాద్ లో ప్రతిష్ఠించబోమే మహా గణపతి విగ్రహం ఎత్తును 70 అడుగులుగా ఖరారు చేశారు.

దీనిపై దానం నాగేందర్ స్పందిస్తూ, గణేశ్ చతుర్థి ఉత్సవాలను ఈసారి ఘనంగా నిర్వహిస్తామని, భక్తులకు ఎలాంటి లోటు రానివ్వబోమని స్పష్టం చేశారు. పోలీస్ భద్రత పెంచాలన్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News