Rahul Gandhi: వాయనాడ్ స్థానాన్ని వదులుకున్న రాహుల్... బరిలో దిగనున్న ప్రియాంక

Rahul Gandhi dicides to give up Wayanad

  • 2024 ఎన్నికల్లో వాయనాడ్, రాయ్ బరేలీ నుంచి రాహుల్ పోటీ
  • రెండు చోట్లా విజయం
  • దేన్ని వదులుకోవాలో తెలియక మథనపడిన రాహుల్
  • ఏఐసీసీ సమావేశంలో చర్చ
  • రాహుల్ వాయనాడ్ ను వదులుకుంటున్నారంటూ ఖర్గే ప్రకటన

ఐదేళ్ల కిందట లోక్ సభ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి కేవలం వాయనాడ్ లో మాత్రమే నెగ్గిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ... 2024 ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల ఘనవిజయం సాధించారు. వాయనాడ్ తో పాటు రాయ్ బరేలీలోనూ రాహుల్ గెలుపు రుచి చూశారు. అయితే ఈ రెండింటిలో ఏ స్థానాన్ని వదులుకోవాలన్నది ఆయనకు పెద్ద సమస్యగా మారింది. 

2019లో ఎదురుగాలిలోనూ తనను ఎంతో ఆదరించి అక్కున్న చేర్చకున్న వాయనాడ్ నియోజకవర్గం ఒకవైపు, పోయిన ప్రాభవాన్ని ఈసారి ఎన్నికల్లో తిరిగి అందించిన రాయ్ బరేలీ మరోవైపు... రాహుల్ ను సందిగ్ధంలో పడేశాయి. తీవ్రంగా ఆలోచించిన మీదట ఆయన కేరళలోని వాయనాడ్ స్థానాన్ని వదులుకోవాలని నిర్ణయించారు. వాయనాడ్ నుంచి రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ బరిలో దిగడం ఖరారైంది. 

దీనిపై రాహుల్ స్పందిస్తూ... వాయనాడ్ ను వదులుకోవాలా, రాయ్ బరేలీని వదులుకోవాలా? అనే అంశంలో తీవ్రంగా మథనపడ్డానని వెల్లడించారు. వాయనాడ్ ఎప్పటికీ తన హృదయానికి దగ్గరగా ఉంటుందని, ఇకమీదట వాయనాడ్ కు తరచుగా వస్తుంటానని తెలిపారు. 

కాగా, రాహుల్ వాయనాడ్ ను వదులుకుంటున్న విషయాన్ని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఏఐసీసీ సమావేశంలో చర్చించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News