IPS: తెలంగాణలో 28 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ... వివరాలు ఇవిగో!
- ఒకేసారి భారీ సంఖ్యలో ఐపీఎస్ లకు స్థానచలనం
- పలువురికి ఎస్పీలుగా పోస్టింగ్ లు
- కొందరికి డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలు
తెలంగాణలో భారీ ఎత్తున ఐపీఎస్ లకు స్థాన చలనం కలిగింది. ఒకేసారి 28 మంది ఐపీఎస్ అధికారులను కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు నేడు ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ ఎస్పీగా విశ్వజిత్ కంపాటి, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెగ్డే, ఏసీబీ జేడీగా రితిరాజ్ లను నియమించారు.
ఐపీఎస్ అధికారి పేరు బదిలీ అయిన స్థానం
1. అశోక్ కుమార్ జగిత్యాల ఎస్పీ
2. సన్ ప్రీత్ సింగ్ సూర్యాపేట ఎస్పీ
3. రాహుల్ హెగ్డే హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ
4. ఎల్.సుబ్బారాయుడు డీజీపీ కార్యాలయం
5. టి.శ్రీనివాసరావు జోగులాంబ గద్వాల్ ఎస్పీ
6. రితిరాజ్ ఏసీబీ జాయింట్ డైరెక్టర్
7. డీవీ శ్రీనివాసరావు కొమురంభీం ఆసిఫాబాద్ ఎస్పీ
8. కె.సురేశ్ కుమార్ బాలానగర్ డీసీపీ
9. జానకి ధరావత్ మహబూబ్ నగర్ ఎస్పీ
10. హర్షవర్ధన్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ
11. విశ్వజిత్ కంపాటి సీఐడీ ఎస్పీ
12. బి.రాజేశ్ శంషాబాద్ డీసీపీ
13. కె.నారాయణరెడ్డి వికారాబాద్ ఎస్పీ
14. ఎన్.కోటిరెడ్డి మేడ్చల్ జోన్ డీసీపీ
15. నితికా పంత్ రాష్ట్ర స్పెషల్ పోలీస్ 2వ బెటాలియన్ కమాండెంట్
16. పీజేపీసీ ఛటర్జీ రాష్ట్ర స్పెషల్ పోలీస్ 2వ బెటాలియన్ కమాండెంట్
17. శరత్ చంద్ర పవార్ నల్గొండ ఎస్పీ
18. చందన దీప్తి రైల్వేస్ ఎస్పీ (సికింద్రాబాద్)
19. షేక్ సలీమా వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ
20. ఎంఏ బారీ డీజీపీ కార్యాలయం
21. పాటిల్ సంగ్రామ్ సింగ్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్
22. పి.సాయి చైతన్య యాంటీ నార్కొటిక్స్ బ్యూరో ఎస్పీ
23. సాధనా రష్మి పెరుమాళ్ హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ
24. రోహిణి ప్రియదర్శిని డిచ్ పల్లి 7వ బెటాలియన్ కమాండెంట్
25. బి.రామ్ ప్రకాశ్ డీజీపీ కార్యాలయం
26. బి.రాజమహేంద్ర నాయక్ జనగామ వెస్ట్ జోన్ డీసీపీ
27. పి.సీతారామ్ డీజీపీ కార్యాలయం
28. ఏ.భాస్కర్ మంచిర్యాల్ డీసీపీ