Rishikonda Palace: రుషికొండలో ఉన్న ప్యాలెస్ జగన్ కు రాజకీయ సమాధి: బైరెడ్డి
- రుషికొండపై ఉన్న భవనాల లోపల ఏముందో నిన్న బహిర్గతం
- 2019లో ఇలాంటి నేతను ఎన్నుకున్నామా అని జనం ఛీకొడుతున్నారన్న బైరెడ్డి
- జగన్ బయటికి వస్తే చెప్పులు, బూట్లు వేస్తారని వ్యాఖ్యలు
విశాఖ రుషికొండపై నిర్మితమైన భవనాల్లో ఏముందో నిన్న బహిర్గతం అయిన నేపథ్యంలో... బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నేడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రుషికొండపై ఉన్న ఆ ప్యాలెస్సే జగన్ కు రాజకీయ సమాధి అని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో ఇలాంటి నేతను ఎన్నుకున్నామా అని జగన్ రెడ్డిని జనం ఛీకొడుతున్నారని అన్నారు.
జగన్ మళ్లీ జనంలోకి వస్తా అంటున్నాడని... అదే జరిగితే జగన్ పై జనం చెప్పులు, బూట్లు వేస్తారని బైరెడ్డి స్పష్టం చేశారు. జగన్ తన గొయ్యిని తానే తవ్వుకున్నాడని విమర్శించారు.
పేదల కోసం శ్రమించే నాయకులు చంద్రబాబు, నారా లోకేశ్ అని బైరెడ్డి కొనియాడారు. వాలంటీర్ల వ్యవస్థపై కూటమి ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.
నందికొట్కూరులో పనిచేసే కొందరు వలంటీర్లు... ప్రభుత్వ పాఠశాలల్లో వంట చేసే ఉద్యోగాల పేరిట రూ.1 లక్ష చొప్పున వసూలు చేసినట్టు తెలిసిందని అన్నారు. ఇలాంటివి చంద్రబాబు ఏమాత్రం సహించరని బైరెడ్డి స్పష్టం చేశారు.