IAS: ఏపీలో పెద్ద ఎత్తున ఐఏఎస్‌ల బదిలీలు... శ్రీలక్ష్మి జీఏడీకి అటాచ్

ias officers tranfers in ap

  • శ్రీలక్ష్మి, రజత్ భార్గవ, ప్రవీణ్ ప్రకాశ్‌లను జీఏడీకి అటాచ్ చేస్తూ ఉత్తర్వుల జారీ
  • శ్రీలక్ష్మి స్థానంలో అనిల్ కుమార్ సింఘాల్‌కు బాధ్యతలు
  • ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్

ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున ఐఏఎస్‌లను బదిలీ చేశారు. పలువురు అధికారులను జేఏడీకి అటాచ్ చేశారు. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌లను జీఏడీకి అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మురళీధర్ రెడ్డిని కూడా జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

శ్రీలక్ష్మి స్థానంలో పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమించారు. జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శిగా శశిభూషణ్ కుమార్, వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్, కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేదిని నియమించారు.

పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా సిద్ధార్థ జైన్, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరబ్ గౌర్, నైపుణ్యాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా సౌరబ్ గౌర్ (అదనపు బాధ్యతలు), పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్, ఐటీ-ఆర్టీజీఎస్ కార్యదర్శిగా కోన శశిధర్ (పూర్తి అదనపు బాధ్యతలు), ఉద్యాన, మత్స్య శాఖ సహకార విభాగాల కార్యదర్శిగా బాబు, ఏపీ సీఆర్డీఏ కమిషనర్‌గా కాటమనేని భాస్కర్, ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్న, ఆర్థిక వ్యయ విభాగం కార్యదర్శిగా జానకి, పశు సంవర్థక శాఖ కార్యదర్శిగా ఎంఎం నాయక్, గనుల శాఖ డైరెక్టర్‌, కమిషనర్‌గా ప్రవీణ్ కుమార్, ఏపీఎండీసీ ఎండీగా ప్రవీణ్ కుమార్ (అదనపు బాధ్యతలు), ఆర్థిక శాఖ కార్యదర్శిగా వినయ్ చందులను నియమించారు.
 

  • Loading...

More Telugu News